T20 Pakistan vs USA : పాకిస్థాన్ 159/7
ABN , Publish Date - Jun 07 , 2024 | 04:49 AM
యూఎ్‌సఏ బౌలర్లు కట్టడి చేయడంతో టీ20 ప్రపంచక్‌పలో పాకిస్థాన్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. గురువారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో కెప్టెన్ బాబర్ ఆజమ్ (44), షాదాబ్ ఖాన్ (40) రాణించడంతో

యూఎస్‌ఏతో మ్యాచ్
డాలస్: యూఎ్‌సఏ బౌలర్లు కట్టడి చేయడంతో టీ20 ప్రపంచక్‌పలో పాకిస్థాన్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. గురువారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో కెప్టెన్ బాబర్ ఆజమ్ (44), షాదాబ్ ఖాన్ (40) రాణించడంతో పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. చివర్లో షహీన్ (23 నాటౌట్) వేగంగా ఆడాడు. ఆరంభంలో యూఎస్ బౌలర్ల ధాటికి పాక్ 26 పరుగులకే రిజ్వాన్ (9), ఉస్మాన్ ఖాన్ (3), ఫఖర్ (11) వికెట్లను కోల్పోయింది. ఈ దశలో బాబర్-షాదాబ్ జోడీ నాలుగో వికెట్‌కు 72 పరుగులు జత చేశారు. చివర్లో షహీన్ కాస్త బ్యాట్ ఝుళిపించడంతో స్కోరు 150 దాటగలిగింది. అనంతరం ఛేదనలో కడపటివార్తలందేసరికి యూఎ్‌సఏ 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. క్రీజులో మోనంక్ పటేల్ (40 బ్యాటింగ్), గౌస్ (35 బ్యాటింగ్) ఉన్నారు.