Share News

ఓటమిబాటలో పాక్‌

ABN , Publish Date - Jan 06 , 2024 | 01:52 AM

పాకిస్థాన్‌తో మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా విజయం దిశగా సాగుతోంది. ప్రత్యర్థికి స్వల్ప తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కోల్పోయిన ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో హాజెల్‌వుడ్‌ (4/9) విజృంభణతో మ్యాచ్‌పై పూర్తిగా పట్టు బిగించింది.

ఓటమిబాటలో పాక్‌

సిడ్నీ: పాకిస్థాన్‌తో మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా విజయం దిశగా సాగుతోంది. ప్రత్యర్థికి స్వల్ప తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కోల్పోయిన ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో హాజెల్‌వుడ్‌ (4/9) విజృంభణతో మ్యాచ్‌పై పూర్తిగా పట్టు బిగించింది. అతడి ధాటికి పాక్‌ రెండో ఇన్నింగ్స్‌లో శుక్రవారం ఆట ఆఖరికి 68 పరుగులకే 7 వికెట్లు చేజార్చుకుంది. సాయిమ్‌ అయూబ్‌ (33), బాబర్‌ ఆజమ్‌ (23) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మొదటి ఇన్నింగ్స్‌లో లభించిన 14 రన్స్‌తో కలిపి పర్యాటక జట్టు మొత్తంగా..82 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు ఓవర్‌నైట్‌..116/2 స్కోరుతో మూడోరోజు మొదటి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీ్‌స..పేసర్‌ ఆమెర్‌ జమాల్‌ (6/69) ధాటికి 299 రన్స్‌కే ఆలౌటైంది. లబుషేన్‌ (60), మిచెల్‌ మార్ష్‌ (54) అర్ధ శతకాలు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ 313 రన్స్‌ చేసిన సంగతి తెలిసిందే.

Updated Date - Jan 06 , 2024 | 06:43 AM