Share News

Neeraj Chopra : గాయం కాదు.. ముందు జాగ్రత్తగా..

ABN , Publish Date - May 27 , 2024 | 04:28 AM

చెక్‌ రిపబ్లిక్‌లో మంగళవారం జరగనున్న ఓస్ట్రవా గోల్డెన్‌ స్పైక్‌ మీట్‌ నుంచి ఒలింపిక్‌ చాంప్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా వైదొలిగాడు. అయితే, గాయం కారణంగానే నీరజ్‌ ఈ ఈవెంట్‌కు

Neeraj Chopra : గాయం కాదు.. ముందు జాగ్రత్తగా..

న్యూఢిల్లీ: చెక్‌ రిపబ్లిక్‌లో మంగళవారం జరగనున్న ఓస్ట్రవా గోల్డెన్‌ స్పైక్‌ మీట్‌ నుంచి ఒలింపిక్‌ చాంప్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా వైదొలిగాడు. అయితే, గాయం కారణంగానే నీరజ్‌ ఈ ఈవెంట్‌కు దూరమయ్యాడనే వార్తలపై అతడు స్పష్టతనిచ్చాడు. తనకు ఎటువంటి గాయమూ కాలేదని సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ‘ప్రాక్టీస్‌ సమయంలో తొడ కండరాల్లో ఏదో అసౌకర్యంగా అనిపించింది. దీంతో ముందు జాగ్రత్తగా మీట్‌ నుంచి తప్పుకొన్నా. గతంలో కూడా ఇలాంటి నొప్పితో ఇబ్బందులుపడ్డా. ఒలింపిక్స్‌ దగ్గర పడుతుండడంతో రిస్క్‌ తీసుకోవాలనుకోవడం లేద’ని నీరజ్‌ తెలిపాడు. గాయంతో చోప్రా మీట్‌ నుంచి తప్పుకొన్నాడని నిర్వాహకులు ప్రకటించిన కొద్ది సేపటికే చోప్రా స్పందించాడు.

Updated Date - May 27 , 2024 | 04:28 AM