ఓజే సింప్సన్ మృతి
ABN , Publish Date - Apr 12 , 2024 | 03:09 AM
అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఫుట్‌బాల్ ఆటగాడు, నటుడు ఓజే సింప్సన్ (76) క్యాన్సర్‌తో బుధవారం మరణించాడు. 1994లో తన మాజీ భార్య నికోల్ బ్రౌన్, ఆమె స్నేహితుడు రాన్ గోల్డ్‌మన్ హత్య కేసులో...
న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఫుట్‌బాల్ ఆటగాడు, నటుడు ఓజే సింప్సన్ (76) క్యాన్సర్‌తో బుధవారం మరణించాడు. 1994లో తన మాజీ భార్య నికోల్ బ్రౌన్, ఆమె స్నేహితుడు రాన్ గోల్డ్‌మన్ హత్య కేసులో అతడు అరెస్ట్ కావడం సంచలనం రేపింది. కానీ కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. 2007లో దోపిడీ, కిడ్నాప్ కేసులో అతడు మరోసారి అరెస్టయ్యాడు. ఈ కేసులో సింప్సన్‌కు 33 ఏళ్ల శిక్ష పడగా, 2017లో పెరోల్‌పై విడుదలయ్యాడు.