Share News

రెండు నెలలుగా పింఛన్లు లేవు!

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:52 AM

స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ (శాట్స్‌) మాజీ ఉద్యోగులకు రెండు నెలలుగా పింఛన్లు అందడంలేదు. దీంతో దాదాపు 160 మంది మాజీ ఉద్యోగులు...

రెండు నెలలుగా పింఛన్లు లేవు!

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ (శాట్స్‌) మాజీ ఉద్యోగులకు రెండు నెలలుగా పింఛన్లు అందడంలేదు. దీంతో దాదాపు 160 మంది మాజీ ఉద్యోగులు ఇక్కట్లు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో శాట్స్‌ ఉద్యోగులకు ప్రతీ నెల 20వ తేదీ తర్వాత కానీ, జీతాలు వచ్చేవి కావు. పింఛన్లు అయితే, 2-3 నెలలకు ఒకసారి వచ్చేవి. కాంగ్రెస్‌ సర్కార్‌ వచ్చాక ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరే శాట్స్‌ సిబ్బందికి కూడా ఈనెల 4వ తేదీనే జీతాలు అందాయి కానీ, పెన్షనర్ల రాత మాత్రం ఇంకా మారలేదు. ఇతర ప్రభుత్వ విభాగాల్లోని మాజీ ఉద్యోగులకు సకాలంలో పెన్షన్లు ఇస్తున్నట్టే తమకూ చెల్లించాలని శాట్స్‌ పెన్షనర్లు కోరుతున్నారు.

Updated Date - Jan 08 , 2024 | 12:52 AM