భారత్ ‘ఎ’ జట్టులో నితీశ్, రికీ భుయ్
ABN , Publish Date - Oct 22 , 2024 | 01:08 AM
ఆస్ట్రేలియా పర్యటన కోసం ప్రకటించిన భారత్ ‘ఎ’ జట్టులో ఇద్దరు ఆంధ్ర క్రికెటర్లకు చోటు దక్కింది. ఇటీవలే అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన నితీశ్ కుమార్‌తో పాటు రికీ భుయ్‌కి కూడా అవకాశం కల్పించారు...
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటన కోసం ప్రకటించిన భారత్ ‘ఎ’ జట్టులో ఇద్దరు ఆంధ్ర క్రికెటర్లకు చోటు దక్కింది. ఇటీవలే అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన నితీశ్ కుమార్‌తో పాటు రికీ భుయ్‌కి కూడా అవకాశం కల్పించారు. సోమవారం 15 మందితో కూడిన ఈ జాబితాను బీసీసీఐ వెల్లడించింది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోటాలో నితీశ్‌కు చాన్స్ దక్కింది. అలాగే దేశవాళీల్లో రాణించిన ఇషాన్ కిషన్‌ను కూడా ఈసారి పరిగణనలోకి తీసుకున్నారు. ఈనెల 31 నుంచి ఆసీస్ ‘ఎ’ జట్టుతో యువ భారత్ రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడే టీమిండియాతో మూడు రోజుల ఇంట్రా స్క్వాడ్ గేమ్‌లో తలపడుతుంది.
భారత్ ‘ఎ’ జట్టు: రుతురాజ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, నితీశ్ కుమార్, దేవ్‌దత్ పడిక్కళ్, రికీ భుయ్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్, అభిషేక్ పోరల్, ముకేశ్ కుమార్, ఖలీల్, యష్ దయాల్, నవ్‌దీప్ సైనీ, మనవ్, తనుష్ కోటియన్.