Share News

క్వార్టర్స్‌లో నిఖత్‌

ABN , Publish Date - Feb 06 , 2024 | 03:27 AM

స్ట్రాంజా ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ స్టార్‌ బాక్సర్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన 50 కిలోల విభాగంలో నిఖత్‌ 3-2తో...

క్వార్టర్స్‌లో నిఖత్‌

లవ్లీనాపై అనర్హత వేటు

స్ట్రాంజా బాక్సింగ్‌

బల్గేరియా: స్ట్రాంజా ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ స్టార్‌ బాక్సర్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన 50 కిలోల విభాగంలో నిఖత్‌ 3-2తో ఒయున్‌సెట్స్‌జ్‌ యెసుజెన్‌ (మంగోలియా)పై నెగ్గింది. ఇదే టోర్నీలో 75 కిలోల విభాగంలో పోటీపడ్డ టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లవ్లీనా అనూహ్యంగా అనర్హత వేటుకు గురైంది. ఐర్లాండ్‌ బౌక్సర్‌ రౌర్కీ అయోఫితో జరిగిన ఆరంభ బౌట్‌లో మూడో రౌండ్‌లో ఇద్దరి మధ్య తీవ్రమైన పెనుగులాట జరగగా, మూడు హెచ్చరికల అనంతరం లవ్లీనాను రెఫరీ డిస్‌క్వాలిఫైగా ప్రకటించాడు.

Updated Date - Feb 06 , 2024 | 03:27 AM