Share News

నకామురాకు విదిత్‌ షాక్‌

ABN , Publish Date - Apr 07 , 2024 | 03:14 AM

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌ రెండో రౌండ్‌లో వరల్డ్‌ నెం.3 నకామురా (అమెరికా)కు భారత గ్రాండ్‌మాస్టర్‌ విదిత్‌ గుజ్‌రాతీ షాకిచ్చాడు. నల్లపావులతో తలపడిన విదిత్‌ కేవలం 29 ఎత్తుల్లో ప్రత్యర్థిని...

నకామురాకు విదిత్‌ షాక్‌

హంపికి డ్రా క్యాండిడేట్స్‌ చెస్‌

టొరొంటో: క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌ రెండో రౌండ్‌లో వరల్డ్‌ నెం.3 నకామురా (అమెరికా)కు భారత గ్రాండ్‌మాస్టర్‌ విదిత్‌ గుజ్‌రాతీ షాకిచ్చాడు. నల్లపావులతో తలపడిన విదిత్‌ కేవలం 29 ఎత్తుల్లో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. ఇద్దరు భారత గ్రాండ్‌మాస్టర్లు తలపడిన మరో రెండో రౌండ్‌లో గుకేష్‌ 33 ఎత్తుల్లో ప్రజ్ఞానందపై గెలుపొందాడు. నెపోమ్నియాచి-అలిరెజాను, టాప్‌సీడ్‌ కరువానా-అబసోవ్‌ను ఓడించారు. రెండో రౌండ్‌ ముగిసేసరికి విదిత్‌, గుకేష్‌, కరువానా, నెపోమ్నియాచి తలా 1.5 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు. ఇక, మహిళల విభాగంలో తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపికి రెండో రౌండ్‌లోనూ డ్రా ఎదురైంది. క్యాథరినా లగ్నో (రష్యా)తో గేమ్‌లో హంపి 38 ఎత్తుల అనంతరం డ్రాకు అంగీకరించింది. సలిమోవా-లీ టింగ్‌ జీ గేమ్‌ కూడా ఫలితం తేలకుండా ముగిసింది. గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌.వైశాలీ-టాన్‌ జోంగ్యీ చేతిలో పోరాడి ఓడింది. వరుసగా రెండో విజయంతో టాన్‌ (2 పాయింట్లు) టాప్‌లో కొనసాగుతోంది. మరో ఇద్దరితో కలిసి హంపి (1) మూడో స్థానంలో నిలిచింది. వైశాలీ (0.5) ఆరో స్థానంలో కొనసాగుతోంది.

Updated Date - Apr 07 , 2024 | 03:28 AM