Share News

మా అమ్మ ఆరోగ్యంగానే ఉంది... కోహ్లీ సోదరుడు వికాస్‌

ABN , Publish Date - Feb 01 , 2024 | 04:10 AM

విరాట్‌ కోహ్లీ తల్లికి తీవ్ర అనారోగ్యం అంటూ సోషల్‌ మీడియాలో రెండో రోజులుగా హల్‌చల్‌ చేస్తున్న వార్తలను అతడి సోదరుడు వికాస్‌ ఖండించాడు.

మా అమ్మ ఆరోగ్యంగానే ఉంది... కోహ్లీ సోదరుడు వికాస్‌

న్యూఢిల్లీ: విరాట్‌ కోహ్లీ తల్లికి తీవ్ర అనారోగ్యం అంటూ సోషల్‌ మీడియాలో రెండో రోజులుగా హల్‌చల్‌ చేస్తున్న వార్తలను అతడి సోదరుడు వికాస్‌ ఖండించాడు. అవన్నీ తప్పుడు కథనాలన్నాడు. ‘మా అమ్మ ఆరోగ్యం గురించి అసత్య ప్రచారం జరుగుతోంది. ఆమె బేషుగ్గా.. ఫిట్‌గా ఉన్నారు. ఎలాంటి సమాచారం లేకుండా ఇలాంటి వదంతులను వ్యాప్తి చేయవద్దని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాన’ని వికాస్‌ ఇన్‌స్టాలో పోస్టు పెట్టాడు. కోహ్లీ తల్లి సరోజ్‌ కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, అందుకే అతడు ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడని సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.

Updated Date - Feb 01 , 2024 | 06:35 AM