Share News

అవకాశాలు చేజార్చుకొని..

ABN , Publish Date - Jan 14 , 2024 | 02:32 AM

పారిస్‌ విశ్వ క్రీడల బెర్త్‌ పట్టేయాలని పట్టుదలగా బరిలో దిగిన భారత మహిళల జట్టుకు ఆరంభంలోనే చుక్కెదురైంది. శనివారం ఇక్కడ ప్రారంభమైన ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీ..

అవకాశాలు చేజార్చుకొని..

అమెరికా చేతిలో భారత్‌ ఓటమి

ఒలింపిక్‌ మహిళల హాకీ క్వాలిఫయర్స్‌

రాంచి: పారిస్‌ విశ్వ క్రీడల బెర్త్‌ పట్టేయాలని పట్టుదలగా బరిలో దిగిన భారత మహిళల జట్టుకు ఆరంభంలోనే చుక్కెదురైంది. శనివారం ఇక్కడ ప్రారంభమైన ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీ..గ్రూప్‌ ‘బి’ తమ తొలి పోరులో సవితా పూనియా సారథ్యంలోని భారత జట్టు 0-1తో 24వ ర్యాంకర్‌ అమెరికా చేతిలో పరాజయం చవిచూసింది. అబిగెయిల్‌ తోమెర్‌ (16వ ని.) చేసిన ఏకైక గోల్‌తో అమెరికా విజయ దక్కించుకుంది. ప్రపంచ ర్యాంకుల్లో ఆరో స్థానంలో ఉన్న భారత్‌..మ్యాచ్‌లో సింహభాగం బంతిని తన అధీనంలోనే ఉంచుకుంది. కానీ ప్రత్యర్థి రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయింది. ఏడు పెనాల్టీ కార్నర్లు లభించినా ఒక్క దానినీ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆదివారం జరిగే రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో మన మహిళలు తలపడతారు. మొదటి రోజు జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ 3-0తో ఇటలీని చిత్తు చేయగా..జపాన్‌ 2-0తో చెక్‌ రిపబ్లిక్‌పై, జర్మనీ 3--0తో చిలీపై విజయం సాధించాయి.

Updated Date - Jan 14 , 2024 | 02:32 AM