Share News

ప్రణయ్‌కు మీరాబ షాక్‌

ABN , Publish Date - May 16 , 2024 | 04:54 AM

స్టార్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌కు థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో చుక్కెదురైంది. భారత్‌కే చెందిన యువ ఆటగాడు మీరాబ లువాంగ్‌ మైస్నమ్‌ ఆరంభరౌండ్లో సహచరుడు ప్రణయ్‌కు షాకిచ్చి...

ప్రణయ్‌కు మీరాబ షాక్‌

‘థాయ్‌లాండ్‌’లో సాత్విక్‌ జోడీ బోణీ

బ్యాంకాక్‌: స్టార్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌కు థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో చుక్కెదురైంది. భారత్‌కే చెందిన యువ ఆటగాడు మీరాబ లువాంగ్‌ మైస్నమ్‌ ఆరంభరౌండ్లో సహచరుడు ప్రణయ్‌కు షాకిచ్చి సంచలనం సృష్టించాడు. మణిపూర్‌కు చెందిన 21 ఏళ్ల మీరాబ 21-18, 21-19తో ఐదోసీడ్‌ ప్రణయ్‌ను కంగుతినిపించి రెండోరౌండ్‌ చేరాడు. ఇక, పురుషుల డబుల్స్‌లో టాప్‌సీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీ శుభారంభం చేసింది. సాత్విక్‌ జంట 21-13, 21-13తో మలేసియా ద్వయం నూర్‌ మ్మద్‌-తాన్‌ వీ కియోంగ్‌ను వరుసగేముల్లో ఓడించి రెండోరౌండ్లో ప్రవేశించింది. మహిళల సింగిల్స్‌ మొదటి రౌండ్లో అస్మిత చాలిహా 19-21, 21-15, 21-14తో ఎస్తర్‌ (ఇండోనేసియా)పై నెగ్గింది. మిగతా భారత షట్లర్లలో ఆకర్షి కశ్యప్‌, మాళవికా బన్సోడ్‌, ఉన్నతి హుడా, సామియా, కిరణ్‌ జార్జ్‌, సతీశ్‌ కుమార్‌ ప్రత్యర్థుల చేతిలో ఓడి ఆదిలోనే వెనుదిరిగారు.

Updated Date - May 16 , 2024 | 04:54 AM