మనోళ్లు గెలిచారు కానీ..
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:58 AM
హర్మన్‌ప్రీత్ సింగ్, సుఖ్‌జీత్ సింగ్ చెరో రెండేసి గోల్స్‌తో అదరగొట్టిన వేళ..జర్మనీతో గురువారం ఇక్కడ జరిగిన రెండో హాకీ టెస్ట్‌లో భారత్ 5-3తో విజయం సాధించింది. అయితే రెండు మ్యాచ్‌ల...

షూటౌట్‌లో పరాజయం
జర్మనీదే హాకీ సిరీస్
న్యూఢిల్లీ: హర్మన్‌ప్రీత్ సింగ్, సుఖ్‌జీత్ సింగ్ చెరో రెండేసి గోల్స్‌తో అదరగొట్టిన వేళ..జర్మనీతో గురువారం ఇక్కడ జరిగిన రెండో హాకీ టెస్ట్‌లో భారత్ 5-3తో విజయం సాధించింది. అయితే రెండు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్ విజేతను తేల్చేందుకు షూటౌట్ నిర్వహించాల్సి వచ్చింది. షూటౌట్‌లో..వరల్డ్ చాంపియన్ జర్మనీ 3-1తో నెగ్గి ట్రోఫీ దక్కించుకుంది. తొలి టెస్ట్‌లో భారత్ ఓడిన విషయం తెలిసిందే. ఇక మజ్కోర్ (7, 57ని.) చేసిన గోల్స్‌తో మొదట జర్మనీ ఆధిక్యం ప్రదర్శించింది. ఆపై హెన్రిక్ (60) మరో గోల్ చేశాడు. రెండో అర్ద భాగంలో సుఖ్‌జీత్ (34, 48), హర్మన్ (42, 43), అభిషేక్ (45) గోల్స్ సాధించడంతో భారత్ విజయాన్నందుకుంది. అయితే షూటౌట్‌లో మనోళ్లు 1-3తో చిత్తయ్యారు. హర్మన్, అభిషేక్, రాహీల్ విఫలంకాగా, ఆదిత్య మాత్రమే గోల్ చేయగలిగాడు.