Share News

మహీ ముద్ర ఎల్లవేళలా

ABN , Publish Date - May 19 , 2024 | 03:29 AM

పొట్టి క్రికెట్‌కు ఐపీఎల్‌ కేరాఫ్‌ అయితే..ఆ ఐపీఎల్‌కు వన్నె తెచ్చిన క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ. అధికారికంగా ప్రకటించకపోయినా మహీకి ఇదే చివరి ఐపీఎల్‌ అని భావిస్తున్నారు. 42 ఏళ్ల వయస్సులో...

మహీ ముద్ర ఎల్లవేళలా

ఆఖరాట ఆడేశాడా?

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

పొట్టి క్రికెట్‌కు ఐపీఎల్‌ కేరాఫ్‌ అయితే..ఆ ఐపీఎల్‌కు వన్నె తెచ్చిన క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ. అధికారికంగా ప్రకటించకపోయినా మహీకి ఇదే చివరి ఐపీఎల్‌ అని భావిస్తున్నారు. 42 ఏళ్ల వయస్సులో..అందునా..టీ20 క్రికెట్‌లో కొనసాగడమంటే ఆషామాషీ కాదు. కానీ అటు కీపింగ్‌ ఇటు బ్యాటింగ్‌లోనూ ఏమాత్రం సత్తా తగ్గలేదు మహీకి. ఈ ఐపీఎల్‌లో యువ కీపర్లను మించి క్యాచ్‌లు అందుకోవడం, బ్యాటింగ్‌లో చివరన వచ్చి అలవోకగా సిక్సర్లు, ఫోర్లు కొట్టిన ధోనీని చూశాం. మరి అలాంటి ఆటగాడు ఐపీఎల్‌కు పర్యాయపదంగా మారడం అతిశయోక్తి కాదు. దేశంలో ఏ వేదికలో చెన్నై బరిలో దిగినా..స్టేడియం యావత్తు పుసుపుమయం అయిందంటే అది చెన్నై జట్టుకున్న క్రేజ్‌ కంటే..మహీ మానియానే కారణమని వేరే చెప్పక్కర్లేదు. ఐపీఎల్‌ ఆవిర్భావం నుంచి (మధ్యలో సీఎ్‌సకేపై నిషేధం విధించిన రెండేళ్లు మినహా.) లీగ్‌పై ఆటగాడిగా, సీఎ్‌సకే కెప్టెన్‌గా తనదైన ముద్ర వేశాడు ధోనీ.


ఈక్రమంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ రికార్డు స్థాయిలో ఐదు టైటిళ్లు అందించడం ఆటగాడిగా మహీ అందుకొన్న ఘనత. అందుకే..తమిళ తంబిలకు ధోనీ అంటే క్రేజ్‌..కాదు ప్రాణం. అలాంటి తమ ఆరాధ్య క్రికెటర్‌కు ఇదే చివరి ఐపీఎల్‌ అంటే ‘డై హార్డ్‌’ ఫ్యాన్స్‌ జీర్ణించుకోవడం కష్టమే. కానీ ఏ క్రికెటరైన ఏదో ఒక సమయంలో రిటైర్‌ కావాల్సిందే. ఇప్పుడు మహీకి ఆ సమయం వచ్చేసినట్టే. వయస్సు కూడా పైబడుతోంది. ఏడాది మొత్తం పోటీ క్రికెట్‌ ఆడుతూ ఫిట్‌నెస్‌ కాపాడుకోవడం వేరు. కానీ సంవత్సరంలో రెండు నెలలు జరిగే టోర్నీకోసం ఫిట్‌గా ఉండడం మాటలు కాదు. కానీ నాలుగు పదులు పైబడినా మైదానంలో అంత చురుగ్గా కదులుతున్నాడంటే అది ధోనీకే చెల్లు. కానీ ఎల్లప్పుడూ అలా ఉండడం సాధ్యం కాదు కదా. గత ఏడాది మోకాలి గాయంతోనే ఐపీఎల్‌ ఆడడమేకాదు జట్టును చాంపియన్‌గానూ నిలిపాడు ధోనీ. ఆ గాయం పూర్తిగా మానలేదని, ఈసారీ అది మహీని బాధిస్తోందట. దీంతో అతడికిదే చివరి ఐపీఎల్‌ అని విశ్వసనీయ సమాచారం. రిటైరైనంత మాత్రాన ధోనీ చెన్నై జట్టును వీడకపోవచ్చు. కెప్టెన్‌ రుతురాజ్‌కు మార్గదర్శనం చేస్తూ, యువ ఆటగాళ్లను తీర్చిదిద్దుతూ ఐపీఎల్‌లో సీఎస్‌కేను తిరుగులేని జట్టుగా కొనసాగించడంలో తన ముద్రను అతడు సుదీర్ఘ కాలం కొనసాగించడం ఖాయం.

Updated Date - May 19 , 2024 | 03:29 AM