Share News

ఇంజెక్షన్లు తీసుకుని ఆడదామనుకున్నా..

ABN , Publish Date - Mar 18 , 2024 | 04:36 AM

గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్‌క్‌పలో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కేవలం నాలుగు మ్యాచ్‌లే ఆడాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కాలి చీలమండ గాయంతో మైదానం వీడిన తను ఇక టోర్నీలో బరిలోకి దిగలేదు. అయితే

ఇంజెక్షన్లు తీసుకుని ఆడదామనుకున్నా..

న్యూఢిల్లీ: గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్‌క్‌పలో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కేవలం నాలుగు మ్యాచ్‌లే ఆడాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కాలి చీలమండ గాయంతో మైదానం వీడిన తను ఇక టోర్నీలో బరిలోకి దిగలేదు. అయితే తిరిగి ఆడేందుకు తాను ఎంతగానో ప్రయత్నించినట్టు పాండ్యా వివరించాడు. ‘చీలమండకి మూడు చోట్ల ఇంజెక్షన్లు వేయించుకున్నా. వాపు కారణంగా రక్తం కూడా తీయించుకున్నా. అయినా గాయం తీవ్రమైంది. కోలుకునేందుకు కనీసం 25 రోజుల విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. అయితే పూర్తి వరల్డ్‌కప్‌ ఆడలేకపోయానన్న బాధ మాత్రం నన్ను తొలిచేస్తూనే ఉంది’ అని పాండ్యా అన్నాడు.

Updated Date - Mar 18 , 2024 | 04:36 AM