Share News

రేసులో లక్ష్మణ్‌? లాంగర్‌, గంభీర్‌ కూడా !

ABN , Publish Date - May 15 , 2024 | 02:05 AM

టీమిండియా కోచ్‌ పదవి మరోసారి చేపట్టేందుకు ద్రవిడ్‌ సుముఖంగా లేకపోతే..అతడి వారసుడు ఎవరన్న చర్చ బయల్దేరింది. అందులో ప్రముఖంగా...

రేసులో లక్ష్మణ్‌? లాంగర్‌, గంభీర్‌ కూడా !

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

టీమిండియా కోచ్‌ పదవి మరోసారి చేపట్టేందుకు ద్రవిడ్‌ సుముఖంగా లేకపోతే..అతడి వారసుడు ఎవరన్న చర్చ బయల్దేరింది. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు వీవీఎస్‌ లక్ష్మణ్‌. అలాగే గౌతమ్‌ గంభీర్‌, ఆసీస్‌ మాజీ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ పేర్లు ప్రస్థావనకు వస్తున్నాయి. లక్ష్మణ్‌ కనుక దరఖాస్తు చేసుకొంటే..హాట్‌ ఫేవరెట్‌ అతడే అనొచ్చు. 49 ఏళ్ల లక్ష్మణ్‌ జాతీయ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌గా మూడున్నరేళ్లుగా ఇండియా ‘ఎ’, అండర్‌-19 జట్ల రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. ద్రవిడ్‌ విశ్రాంతి తీసుకున్న సమయాల్లో భారత జట్టు కోచింగ్‌ బాధ్యతలు నిర్వర్తించాడు. లక్ష్మణ్‌ కోచ్‌గా ఆసియా క్రీడలు, ఆసీ్‌సతో మనదేశంలో, ఇంగ్లండ్‌తో ఆ దేశంలో, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌లలో ఆయా దేశాలలో ద్వైపాక్షిక టీ20 సిరీ్‌సలలో భారత్‌ తలపడింది.


గంభీర్‌: కెప్టెన్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు రెండు ఐపీఎల్‌ టైటిళ్లు అందించడంతో పాటు లఖ్‌నవూ మెంటార్‌గా ఆ జట్టును తొలి రెండేళ్లు ప్లేఆ్‌ఫ్సకు చేర్చడంలో గంభీర్‌ది కీలక పాత్ర. పైగా.. గంభీర్‌కు మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు అమోఘమన్న పేరుంది. ఈ ఐపీఎల్‌లో గంభీర్‌ మార్గదర్శనంలో కోల్‌కతా ఇప్పటికే ప్లేఆ్‌ఫ్సకు చేరింది కూడా. అయితే గంభీర్‌ వ్యక్తిత్వపరంగా చూస్తే..బీసీసీఐ పెద్దలు అడగకుండా తనంతట తాను కోచ్‌ పదవికి అతడు దరఖాస్తు చేస్తాడా అన్నది డౌటే. కోల్‌కతా యజమాని షారుక్‌ఖాన్‌తో గంభీర్‌కున్న గాఢ అను బంధం దృష్ట్యా..కోచ్‌ పదవికి గంభీర్‌ దరఖాస్తు చేయడనే మరో వాదన కూడా ఉంది. ఇంకా..తన పదవి విషయంలో గంభీర్‌ పూర్తి స్వేచ్ఛను కోరుకొనే మనస్తత్వం. మరోవైపు రాబోయే రెండేళ్లు విరాట్‌ కోహ్లీ జట్టులో ఉండడం ఖాయం. మరి..గంభీర్‌, కోహ్లీ గత సంబంఽధాల కోణంలో చూస్తే..గంభీర్‌ కోచ్‌గా వెళతాడా అనేది మరో ముఖ్యమైన అంశం. అయితే ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌, గంభీర్‌ మధ్య చక్కటి అనుబంఽధం ఉండడం విశేషం.

లాంగర్‌: ఆస్ట్రేలియాకు యాషెస్‌, టీ20 వరల్డ్‌ కప్‌ అందించిన కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌కు తిరుగులేని వ్యూహాత్మక నిపుణుడిగా పేరుంది. టీమిండియా కోచ్‌ పదవిని చేపట్టే అవకాశాన్ని పరిశీలిస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా లాంగర్‌ చెప్పడం గమనార్హం.

Updated Date - May 15 , 2024 | 02:05 AM