Share News

KKR vs LSG: లక్నో బ్యాటర్లను కట్టడి చేసిన కోల్‌కతా బౌలర్లు.. మోస్తరు లక్ష్యం!

ABN , Publish Date - Apr 14 , 2024 | 05:41 PM

ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు మరోసారి రాణించారు. లక్నో సూపర్ జెయింట్స్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా లక్ష్యం 162 పరుగులుగా ఉంది. లక్నో బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (39), ఆయుశ్ బదోనీ (29), నికోలస్ పూరన్ (45) మాత్రమే ఫర్వాలేదనిపించారు.

KKR vs LSG: లక్నో బ్యాటర్లను కట్టడి చేసిన కోల్‌కతా బౌలర్లు.. మోస్తరు లక్ష్యం!

కోల్‌కతా: ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు మరోసారి రాణించారు. లక్నో సూపర్ జెయింట్స్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా లక్ష్యం 162 పరుగులుగా ఉంది. లక్నో బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (39), ఆయుశ్ బదోనీ (29), నికోలస్ పూరన్ (45) మాత్రమే ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోర్లకే పెవిలీయన్ చేరారు. ఓపెనర్ క్వింటన్ డికాక్ (10), దీపక్ హుడా (8), మార్కస్ స్టోయినిస్ (10), కృనాల్ పాండ్యా (7 నాటౌట్), అర్షద్ ఖాన్ (5) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు.

కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 కీలక వికెట్లు లక్నోని కోలుకోలేని దెబ్బకొట్టాడు. వైభవ్ ఆరోరా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తీ, ఆండ్ర్యూ రస్సెల్ తలో వికెట్ తీశారు.

Updated Date - Apr 14 , 2024 | 05:41 PM