Share News

జ్యోతి బృందానికి పసిడి

ABN , Publish Date - May 26 , 2024 | 04:37 AM

ఆర్చరీ వరల్డ్‌ కప్‌ స్టేజ్‌-2లో జ్యోతి సురేఖకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ఆమె నేతృత్వంలోని కాంపౌండ్‌ మహిళల జట్టు స్వర్ణం సాధించగా...

జ్యోతి బృందానికి పసిడి

మిక్స్‌డ్‌లో రజతం

యెచియాన్‌ (కొరియా): ఆర్చరీ వరల్డ్‌ కప్‌ స్టేజ్‌-2లో జ్యోతి సురేఖకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ఆమె నేతృత్వంలోని కాంపౌండ్‌ మహిళల జట్టు స్వర్ణం సాధించగా.. మిక్స్‌డ్‌ విభాగంలో రజతం దక్కింది. శనివారం జరిగిన ఫైనల్లో జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్‌ కౌర్‌ల త్రయం 232-226తో టర్కీపై గెలిసి పసిడిని సొంతం చేసుకొంది. కాగా, మిక్స్‌డ్‌ విభాగం స్వర్ణ పోరులో జ్యోతి సురేఖ, ప్రియాన్ష్‌ల ద్వయం 153-155తో అమెరికా జంట ఒలీవియా డీన్‌, సాయర్‌ సిల్లివన్‌ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల వ్యక్తిగత ఈవెంట్‌ కాంస్య పోరు టైబ్రేక్‌లో ఓడిన ప్రథమేష్‌ త్రుటిలో పతకాన్ని కోల్పోయాడు.

Updated Date - May 26 , 2024 | 04:37 AM