Share News

మిక్స్‌డ్‌ ఫైనల్లో జ్యోతి జోడీ

ABN , Publish Date - May 25 , 2024 | 05:31 AM

వరల్డ్‌కప్‌ స్టేజ్‌-2 కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ కేటగిరీలో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ-ప్రియాన్షు జోడీ ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన సెమీ్‌సలో జ్యోతి జంట 158-157తో హాన్‌ సెంగ్యోన్‌-యాంగ్‌

మిక్స్‌డ్‌ ఫైనల్లో జ్యోతి జోడీ

యెచెయోన్‌ (దక్షిణకొరియా): వరల్డ్‌కప్‌ స్టేజ్‌-2 కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ కేటగిరీలో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ-ప్రియాన్షు జోడీ ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన సెమీ్‌సలో జ్యోతి జంట 158-157తో హాన్‌ సెంగ్యోన్‌-యాంగ్‌ జేవోన్‌పై గెలిచింది. ఫైనల్లో అమెరికా ద్వయం ఒలివియా డీన్‌-సాయర్‌ సులివన్‌తో జ్యోతి జోడీ అమీతుమీ తేల్చుకోనుంది. రికర్వ్‌ మహిళల సింగిల్స్‌లో దీపికా కుమారి సెమీస్‌ చేరింది. ఇక, ధీరజ్‌, ప్రవీణ్‌ జాదవ్‌ రెండో రౌండ్‌లోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు.

Updated Date - May 25 , 2024 | 05:31 AM