Share News

పారిస్‌ ఒలింపిక్స్‌కు జ్యోతి!

ABN , Publish Date - Jul 03 , 2024 | 02:55 AM

తెలుగు అథ్లెట్‌ జ్యోతి ఎర్రాజీ పారిస్‌ ఒలింపిక్స్‌కు ఎంపికవడం ఖాయమైనట్లే. ప్రపంచ అథ్లెటిక్స్‌ సమాఖ్య మంగళవారం ప్రకటించిన వరల్డ్‌ ర్యాంకింగ్స్‌ కటాఫ్‌ ప్రకారం 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి...

పారిస్‌ ఒలింపిక్స్‌కు జ్యోతి!

న్యూఢిల్లీ: తెలుగు అథ్లెట్‌ జ్యోతి ఎర్రాజీ పారిస్‌ ఒలింపిక్స్‌కు ఎంపికవడం ఖాయమైనట్లే. ప్రపంచ అథ్లెటిక్స్‌ సమాఖ్య మంగళవారం ప్రకటించిన వరల్డ్‌ ర్యాంకింగ్స్‌ కటాఫ్‌ ప్రకారం 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి, షాట్‌ఫుట్‌లో అభా ఖతువా భారత్‌ నుంచి విశ్వక్రీడలకు అర్హత సాధించిన అథ్లెట్ల జాబితాలో నిలిచారు. పారిస్‌లో మొత్తం 40 మంది అథ్లెట్లు పోటీపడే తన ఈవెంట్‌లో జ్యోతికి ర్యాంకింగ్స్‌ కటాఫ్‌లో 34వ స్థానం దక్కింది. పారిస్‌ క్రీడలకు ఎంపికైన అథ్లెట్ల తుది జాబితాను ఈనెల 7న అధికారికంగా ప్రకటిస్తారు. ఇదే జరిగితే, ఒలింపిక్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో పోటీపడనున్న భారత అథ్లెట్‌గా జ్యోతి రికార్డుకెక్కనుంది.

Updated Date - Jul 03 , 2024 | 02:55 AM