Share News

అప్పుడే ధోనీతో పోలికా?

ABN , Publish Date - Mar 01 , 2024 | 05:50 AM

యువ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌.. మరో ధోనీ అంటూ గవాస్కర్‌ చేసిన వ్యాఖ్యలతో టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ విభేదించాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌ విజయంలో జురెల్‌ కీలకపాత్ర పోషించాడు...

అప్పుడే ధోనీతో పోలికా?

న్యూఢిల్లీ: యువ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌.. మరో ధోనీ అంటూ గవాస్కర్‌ చేసిన వ్యాఖ్యలతో టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ విభేదించాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌ విజయంలో జురెల్‌ కీలకపాత్ర పోషించాడు. తీవ్ర ఒత్తిడిలోనూ ధ్రువ్‌ ఆడిన తీరును దాదా సైతం ప్రశంసించాడు. ‘అతడేమీ ధోనీ కాదు. తనదైన ఆటను ఆడుకోనివ్వండి. స్పిన్నర్లు, పేసర్లను.. ముఖ్యంగా ఒత్తిడి సమయాల్లో ధ్రువ్‌ ఎదుర్కొంటున్న తీరు ఆకట్టుకొంద’ని గంగూలీ చెప్పాడు.

Updated Date - Mar 01 , 2024 | 05:50 AM