గుజరాత్‌పై జైపూర్ గెలుపు
ABN , Publish Date - Dec 11 , 2024 | 05:15 AM
అర్జున్ దేశ్వాల్ విజృంభించడంతో.. ప్లేఆఫ్స్ రేసులో జైపూర్ పింక్ పాంథర్స్ కీలక విజయాన్ని నమోదు చేసింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పింక్ పాంథర్స్ 42-29తో...
పుణె: అర్జున్ దేశ్వాల్ విజృంభించడంతో.. ప్లేఆఫ్స్ రేసులో జైపూర్ పింక్ పాంథర్స్ కీలక విజయాన్ని నమోదు చేసింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పింక్ పాంథర్స్ 42-29తో గుజరాత్ జెయింట్స్‌పై గెలిచింది. కెప్టెన్ దేశ్వాల్ 13 పాయింట్లతో అదరగొట్టగా.. డిఫెండర్ అంకుశ్ 5 టాకిలింగ్స్ చేశాడు. ఫస్టా్‌ఫలో రెండుసార్లు గుజరాత్‌ను అవుట్ చేసిన జైపూర్ 27-16తో పైచేయిగా నిలిచింది. సెకండా్‌ఫలో జెయింట్స్ దీటుగానే పోరాడినా.. ఆధిక్యాన్ని కాపాడుకొన్న జైపూర్ మ్యాచ్‌ను సొంతం చేసుకొంది. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 44-29తో బెంగళూరు బుల్స్‌ను చిత్తు చేసింది. విశ్వాస్ 14 రైడ్ పాయింట్లు సాధించగా.. డిఫెండర్లు నితీశ్, ఫజల్ చెరో 7 టాకిలింగ్స్ చేయడం విశేషం. బుల్స్ తరఫున పర్‌దీప్ నర్వాల్ 14 పాయింట్లు స్కోరు చేసినా ప్రయోజనం లేకపోయింది.