Share News

జైస్వాల్‌ అవుటా? నాటౌటా?

ABN , Publish Date - Dec 31 , 2024 | 06:16 AM

భారత్‌ ఛేదనలో అత్యంత కీలక సమయంలో జైస్వాల్‌ నిష్క్రమణ వివాదాస్ప దంగా మారింది. ఇన్నింగ్స్‌ 71వ ఓవర్‌లో కమిన్స్‌ వేసిన బంతిని లెగ్‌ సైడ్‌ ఆడేందుకు జైస్వాల్‌ ప్రయత్నిం చాడు. కానీ ఈక్రమంలో బంతి వెళ్లి...

జైస్వాల్‌ అవుటా? నాటౌటా?

భారత్‌ ఛేదనలో అత్యంత కీలక సమయంలో జైస్వాల్‌ నిష్క్రమణ వివాదాస్ప దంగా మారింది. ఇన్నింగ్స్‌ 71వ ఓవర్‌లో కమిన్స్‌ వేసిన బంతిని లెగ్‌ సైడ్‌ ఆడేందుకు జైస్వాల్‌ ప్రయత్నిం చాడు. కానీ ఈక్రమంలో బంతి వెళ్లి కీపర్‌ క్యారీ చేతుల్లో పడింది. అటు ఆసీస్‌ క్యాచ్‌ అవుట్‌ కోసం అప్పీల్‌ చేయగా, అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. వెంటనే కమిన్స్‌ డీఆర్‌ఎస్‌ కోరడంతో రీప్లేలో బంతి బ్యాట్‌కు, గ్లౌవ్స్‌కు తాకి నట్టు స్నికోమీటర్‌లో ఎక్కడా స్పైక్స్‌ కనిపించలేదు. కానీ ఆ బంతి ప్రయాణి స్తున్న మార్గంలో మార్పును గమనించి థర్డ్‌ అంపైర్‌ అవుట్‌గా ప్రకటించ డంతో భారత శిబిరం షాక్‌కు గురైంది. వాస్తవా నికి టెక్నాలజీని వాడుతున్నప్పుడు దానికే కట్టుబడి ఉండాలి. కానీ బంగ్లాదేశ్‌కు చెందిన థర్డ్‌ అంపైర్‌ షర్ఫుద్దౌలా మాత్రం.. బంతి జైస్వాల్‌ గ్లౌవ్స్‌కు తాకినట్టుగా కనిపిస్తుందంటూ అవుట్‌ ప్రకటించాడు.

Updated Date - Dec 31 , 2024 | 06:16 AM