Share News

అఫ్ఘాన్‌తో ఏకైక టెస్టు ఐర్లాండ్‌కు ఆధిక్యం

ABN , Publish Date - Mar 01 , 2024 | 05:47 AM

అఫ్ఘానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో ఐర్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం అందుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 101/4తో రెండో రోజు ఆట కొనసాగించిన ఐర్లాండ్‌ 263 పరుగుల వద్ద ఆలౌటైంది...

అఫ్ఘాన్‌తో ఏకైక టెస్టు ఐర్లాండ్‌కు ఆధిక్యం

అబుధాబి : అఫ్ఘానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో ఐర్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం అందుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 101/4తో రెండో రోజు ఆట కొనసాగించిన ఐర్లాండ్‌ 263 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో ఆ జట్టుకు 108 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించినట్టయింది. స్టిర్లింగ్‌ (56), కాంఫెర్‌ (49) రాణించారు. రెహ్మాన్‌కు ఐదు, నవీద్‌కు 3 వికెట్లు లభించాయి. అనంతరం అఫ్ఘాన్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 134 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. అఫ్ఘాన్‌ జట్టు ప్రస్తుతం 26 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. అఫ్ఘాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 155 రన్స్‌కే ఆలౌటైంది.

Updated Date - Mar 01 , 2024 | 05:47 AM