Share News

ఐపీఎల్‌ వీక్షణలో రికార్డు

ABN , Publish Date - Apr 05 , 2024 | 01:58 AM

తాజా ఐపీఎల్‌ సీజన్‌ను క్రికెట్‌ ప్రేమికులు తెగ ఆదరిస్తున్నారు. తొలి పది మ్యాచ్‌లను టీవీల్లో 30 కోట్ల మంది వీక్షించినట్టు అధికారిక బ్రాడ్‌కాస్టర్‌ డిస్నీ స్టార్‌ గ్రూప్‌ వెల్లడించింది..

ఐపీఎల్‌ వీక్షణలో రికార్డు

న్యూఢిల్లీ: తాజా ఐపీఎల్‌ సీజన్‌ను క్రికెట్‌ ప్రేమికులు తెగ ఆదరిస్తున్నారు. తొలి పది మ్యాచ్‌లను టీవీల్లో 30 కోట్ల మంది వీక్షించినట్టు అధికారిక బ్రాడ్‌కాస్టర్‌ డిస్నీ స్టార్‌ గ్రూప్‌ వెల్లడించింది. ఇది ఇప్పటిదాకా జరిగిన అన్ని సీజన్లలోనూ అత్యధికం కావడం విశేషం. అలాగే బార్క్‌ డేటా ప్రకారం ఓవరాల్‌గా వాచ్‌ టైమ్‌ 8028 కోట్ల నిమిషాలు. ఇది గతేడాదికన్నా 20ు అధికం. ఐపీఎల్‌ మ్యాచ్‌లను స్టార్‌ గ్రూప్‌ పది భాషల్లో అందిస్తోంది. ఆరంభ మ్యాచ్‌ను కూడా 16.8కోట్ల మంది వీక్షించిన విషయం తెలిసిందే.

Updated Date - Apr 05 , 2024 | 01:58 AM