Share News

IPL Punjab vs Delhi : అదరగొట్టిన కర్రాన్‌

ABN , Publish Date - Mar 24 , 2024 | 02:57 AM

రీఎంట్రీని ఘనంగా చాటాలనుకొన్న రిషభ్‌ పంత్‌ ఆశలపై సామ్‌ కర్రాన్‌ (47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 63) నీళ్లు కుమ్మరించాడు. లివింగ్‌స్టోన్‌ (21 బంతుల్లో 38 నాటౌట్‌) కూడా రాణించడంతో.. కొత్త హోంగ్రౌండ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ శుభారంభం చేసింది. ఐపీఎల్‌లో శనివారం

IPL Punjab vs Delhi : అదరగొట్టిన కర్రాన్‌

పంజాబ్‌ బోణీ

4 వికెట్లతో ఓడిన ఢిల్లీ

చండీగఢ్‌: రీఎంట్రీని ఘనంగా చాటాలనుకొన్న రిషభ్‌ పంత్‌ ఆశలపై సామ్‌ కర్రాన్‌ (47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 63) నీళ్లు కుమ్మరించాడు. లివింగ్‌స్టోన్‌ (21 బంతుల్లో 38 నాటౌట్‌) కూడా రాణించడంతో.. కొత్త హోంగ్రౌండ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ శుభారంభం చేసింది. ఐపీఎల్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. 453 రోజుల తర్వాత మళ్లీ మైదానంలోకి పునరాగమనం చేసిన ఢిల్లీ కెప్టెన్‌ పంత్‌ (13 బంతుల్లో 2 ఫోర్లతో 18) ఈ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. బ్యాట్‌తో అతడు పెద్దగా మెరవకపోయినా.. ఉత్సాహంగా కీపింగ్‌ చేస్తూ ఒక స్టంపింగ్‌తోపాటు క్యాచ్‌ను తీసుకున్నాడు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 174/9 స్కోరు చేసింది. మార్ష్‌ (20)తో కలసి తొలి వికెట్‌కు 39 పరుగులు జోడించిన వార్నర్‌ (29).. షాయ్‌ హోప్‌ (33)తో రెండో వికెట్‌కు 35 రన్స్‌ భాగస్వామ్యం నెలకొల్పాడు. హోప్‌, పంత్‌, రికీ భుయ్‌ (3) వెంటవెంటనే అవుటయ్యారు. చివర్లో అభిషేక్‌ పోరెల్‌ (10 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 నాటౌట్‌) వేగంగా ఆడడంతో క్యాపిటల్స్‌ స్కోరు 170 దాటింది.

అలవోకగా..: ఛేదనలో పంజాబ్‌ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసి గెలిచింది. బెయిర్‌స్టో (9), ధవన్‌ (22) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. అయితే, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (26)తో కలసి మూడో వికెట్‌కు 42 పరుగులు జోడించిన కర్రాన్‌ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. సింగ్‌ను కుల్దీప్‌ అవుట్‌ చేసినా.. లివింగ్‌స్టోన్‌తో కలసి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌‘ కర్రాన్‌ 5వ వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో పంజాబ్‌ సునాయాసంగా నెగ్గింది. గాయపడిన ఇషాంత్‌ శర్మ (1/16) మళ్లీ బౌలింగ్‌కు రాకపోవడం డెత్‌ ఓవర్లలో ప్రభావం చూపింది. ఖలీల్‌, కుల్దీప్‌ చెరో 2 వికెట్లు కూల్చారు.

స్కోరుబోర్డు

ఢిల్లీ: వార్నర్‌ (సి) జితేష్‌ (బి) హర్షల్‌ 29, మార్ష్‌ (సి) చాహర్‌ (బి) అర్ష్‌దీప్‌ 20, హోప్‌ (సి) హర్‌ప్రీత్‌ (బి) రబాడ 33, పంత్‌ (సి) బెయిర్‌స్టో (బి) హర్షల్‌ 18, రికీ భుయ్‌ (సి) జితేష్‌ (బి) హర్‌ప్రీత్‌ 3, స్టబ్స్‌ (సి) శశాంక్‌ (బి) చాహర్‌ 5, అక్షర్‌ (రనౌట్‌) 21, సుమీత్‌ (సి) జితేష్‌ (బి) అర్ష్‌దీప్‌ 2, పోరెల్‌ (నాటౌట్‌) 32, కుల్దీప్‌ (రనౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం 20 ఓవర్లలో 174/9; వికెట్ల పతనం: 1-39, 2-74, 3-94, 4-111, 5-111, 6-128, 7-138, 8-147, 9-174; బౌలింగ్‌: కర్రాన్‌ 1-0-10-0, అర్ష్‌దీప్‌ 4-0-28-2, రబాడ 4-0-36-1, హర్‌ప్రీత్‌ 3-0-14-1, రాహుల్‌ చాహర్‌ 4-0-33-1, హర్షల్‌ 4-0-47-2.

పంజాబ్‌: ధవన్‌ (బి) ఇషాంత్‌ 22, బెయిర్‌స్టో (రనౌట్‌) 9, ప్రభ్‌సిమ్రన్‌ (సి) వార్నర్‌ (బి) కుల్దీప్‌ 26, కర్రాన్‌ (బి) ఖలీల్‌ 63, జితేష్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) కుల్దీప్‌ 9, లివింగ్‌స్టోన్‌ (నాటౌట్‌) 38, శశాంక్‌ (సి) పంత్‌ (బి) ఖలీల్‌ 0, హర్‌ప్రీత్‌(నాటౌట్‌)2;ఎక్స్‌ట్రాలు:8;మొత్తం: 19.2 ఓవర్లలో 177/6; వికెట్ల పతనం: 1-34,2-42, 3-84, 4-100, 5-167, 6-167; బౌలింగ్‌:ఖలీల్‌ 4-0-43-2,ఇషాంత్‌ 2-0-16-1,మార్ష్‌ 4-0-52-0,అక్షర్‌ 4-0-25-0,కుల్దీప్‌ 4-0-20-2, సుమీత్‌ 1.2-0-19-0.

Updated Date - Mar 24 , 2024 | 02:57 AM