Share News

భారత హ్యామర్‌ త్రోయర్‌ రచనపై 12 ఏళ్ల నిషేధం

ABN , Publish Date - Feb 14 , 2024 | 01:46 AM

భారత హ్యామర్‌ త్రో అథ్లెట్‌ రచనా కుమారిపై వేటు పడింది. పలుమార్లు డోప్‌ పరీక్షల్లో విఫల మవడంతో 30 ఏళ్ల రచనపై 12 ఏళ్ల నిషేధాన్ని విధిస్తూ అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య ...

భారత హ్యామర్‌ త్రోయర్‌ రచనపై 12 ఏళ్ల నిషేధం

న్యూఢిల్లీ: భారత హ్యామర్‌ త్రో అథ్లెట్‌ రచనా కుమారిపై వేటు పడింది. పలుమార్లు డోప్‌ పరీక్షల్లో విఫల మవడంతో 30 ఏళ్ల రచనపై 12 ఏళ్ల నిషేధాన్ని విధిస్తూ అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య సమగ్రత విభాగం (ఏఐయూ) మంగళ వారం నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం గతేడాది నవంబ రు 24వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. గతంలోనూ డోపీగా పట్టుబడ్డ రచన.. 2015 మార్చి నుంచి నాలుగేళ్ల పాటు నిషేధానికి గురవడం గమనార్హం. నిరుడు ఆసియా క్రీడల్లో పోటీపడ్డ రచన.. ఇప్పటిదాకా ఒక్క అంతర్జాతీయ పతకం కూడా నెగ్గలేదు.

Updated Date - Feb 14 , 2024 | 01:46 AM