సెమీ్‌సలో భారత కుర్రాళ్లు
ABN , Publish Date - Oct 22 , 2024 | 01:16 AM
ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టీ20 టోర్నీలో జోరు ప్రదర్శిస్తున్న భారత్ ‘ఎ’ జట్టు వరుసగా రెండో విజయంతో సెమీఫైనల్‌కు దూసుకు పోయింది. గ్రూప్ ‘బి’లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లతో యూఏఈని చిత్తు చేసింది...
యూఏఈపై గెలుపు
ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్
అల్‌అమెరాత్ (ఒమన్): ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టీ20 టోర్నీలో జోరు ప్రదర్శిస్తున్న భారత్ ‘ఎ’ జట్టు వరుసగా రెండో విజయంతో సెమీఫైనల్‌కు దూసుకు పోయింది. గ్రూప్ ‘బి’లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లతో యూఏఈని చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ..పేసర్లు రసిఖ్ (3/15), రమణ్‌దీప్ (2/7) ధాటికి 16.5 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. రాహుల్ చోప్రా (50) హాఫ్ సెంచరీతోపాటు కెప్టెన్ బాసిల్ హమీద్ (22) రాణించడంతో యూఏఈకి ఆ మాత్రం స్కోరైనా సాధ్యమైంది. కాంబోజ్, వైభవ్ అరోరా, అభిషేక్ శర్మ, నేహల్ వధేరా తలో వికెట్ తీశారు. అభిషేక్ శర్మ (58), కెప్టెన్ తిలక్ వర్మ (21) చెలరేగడంతో స్వల్ప ఛేదనను భారత్ ‘ఎ’ 10.5 ఓవర్లలో 111/3 స్కోరుతో ముగించింది. రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సాధించిన భారత్ ‘ఎ’ గ్రూప్‌లో టాపర్‌గా నిలిచింది. బుధవారం జరిగే గ్రూప్ ఆఖరి మ్యాచ్‌లో ఒమన్‌తో తలపడనుంది. కాగా..మరో గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో పాకిస్థాన్ ‘ఎ’ 74 పరుగులతో ఒమన్‌పై నెగ్గింది.
సంక్షిప్తస్కోర్లు
యూఏఈ: 16.5 ఓవర్లలో 107 ఆలౌట్ (రాహుల్ చోప్రా 50, బాసిల్ హమీద్ 22, రసిఖ్ సలామ్ 3/15, రమణ్‌దీప్ 2/7); భారత్: 10.5 ఓవర్లలో 111/3 (అభిషేక్ శర్మ 58, తిలక్ వర్మ 21, బదోనీ 12 నాటౌట్, విష్ణు సుకుమారన్ 1/10).