Share News

వర్షార్పణం

ABN , Publish Date - Jul 08 , 2024 | 06:03 AM

వర్షం కారణంగా భారత్‌, దక్షిణాఫ్రికా మహిళల రెండో టీ20 రద్దయింది. లక్ష్య ఛేదనలో భారత్‌ బరిలోకి దిగాల్సి ఉండగా.. ఇన్నింగ్స్‌ బ్రేక్‌ అనంతరం మొదలైన వర్షం ఎంతకీ తగ్గలేదు. దీంతో భారత్‌ ఒక్క బంతి కూడా ఆడలేకపోయింది. వేచిచూసిన అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

వర్షార్పణం

దక్షిణాఫ్రికాతో భారత మహిళల రెండో టీ20 రద్దు

చెన్నై: వర్షం కారణంగా భారత్‌, దక్షిణాఫ్రికా మహిళల రెండో టీ20 రద్దయింది. లక్ష్య ఛేదనలో భారత్‌ బరిలోకి దిగాల్సి ఉండగా.. ఇన్నింగ్స్‌ బ్రేక్‌ అనంతరం మొదలైన వర్షం ఎంతకీ తగ్గలేదు. దీంతో భారత్‌ ఒక్క బంతి కూడా ఆడలేకపోయింది. వేచిచూసిన అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మూడు టీ20ల సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0తో ఆధిక్యంలో ఉంది. మంగళవారం ఆఖరి మ్యాచ్‌ జరగనుంది. అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌ తజ్మిన్‌ బ్రిట్స్‌ (52) వరుసగా రెండో అర్ధశతకం బాదగా.. అన్నెక్‌ బాష్‌ (40), లారా వొల్వార్ట్‌ (22) రాణించారు. పూజా వస్త్రాకర్‌, దీప్తి చెరో 2 వికెట్లు తీశారు.

Updated Date - Jul 08 , 2024 | 06:03 AM