కతార్ చేతిలో భారత్ ఓటమి
ABN , Publish Date - Jun 12 , 2024 | 02:38 AM
ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ నుంచి భారత ఫుట్‌బాల్ జట్టు నిష్క్రమించింది. మంగళవారం ఇక్కడ జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో భారత్ 1-2 గోల్స్ తేడాతో కతార్ చేతిలో పరాజయం పాలైంది...

ఫిఫా వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ నుంచి అవుట్
దోహా: ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ నుంచి భారత ఫుట్‌బాల్ జట్టు నిష్క్రమించింది. మంగళవారం ఇక్కడ జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో భారత్ 1-2 గోల్స్ తేడాతో కతార్ చేతిలో పరాజయం పాలైంది. తద్వారా తదుపరి రౌండ్ చేరడంలో విఫలమైన భారత్.. క్వాలిఫయర్స్ నుంచి నిరాశగా వెనుదిరిగింది. భారత్ తరఫున ఏకైక గోల్‌ను లాలియాన్‌జువాల ఛాంగ్తే (37వ) కొట్టగా.. కతార్ జట్టులో యూసుఫ్ యెమన్ (73వ), అహ్మద్ అల్ రవి (85వ) చెరో గోల్ సాధించారు.