Share News

రెండో టెస్ట్‌లోనూ ఓడిన భారత్‌

ABN , Publish Date - Apr 08 , 2024 | 01:27 AM

ఆస్ట్రేలియా పర్యటనలో భారత హాకీ జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన రెండో టెస్ట్‌లో భారత్‌ 2-4తో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది...

రెండో టెస్ట్‌లోనూ ఓడిన భారత్‌

పెర్త్‌: ఆస్ట్రేలియా పర్యటనలో భారత హాకీ జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన రెండో టెస్ట్‌లో భారత్‌ 2-4తో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. దీంతో ఐదు టెస్ట్‌ల సిరీ్‌సలో టీమిండియా 0-2తో వెనుకబడింది. జుగ్‌రాజ్‌ సింగ్‌ (9వ), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (30వ) చెరో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచారు. ఆసీస్‌ తరఫున జెరేమీ హేవర్డ్‌ (6వ, 34వ), జాకబ్‌ అండర్సన్‌ (42వ), నాథన్‌ ఎఫ్రామస్‌ (45వ) గోల్స్‌ సాధించారు. బుధవారం మూడో మ్యాచ్‌ జరగనుంది.

Updated Date - Apr 08 , 2024 | 01:27 AM