మహిళా ఫుట్‌బాలర్లపై దాడుల కేసులో.. దీపక్ శర్మపై వేటు
ABN , Publish Date - Apr 03 , 2024 | 01:33 AM
ఇద్దరు మహిళా ఫుట్‌బాలర్లపై భౌతిక దాడులకు పాల్పడిన కేసులో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎ్‌ఫఎఫ్) ఈసీ సభ్యుడు దీపక్ శర్మపై సస్పెన్షన్ వేటుపడింది...

న్యూఢిల్లీ: ఇద్దరు మహిళా ఫుట్‌బాలర్లపై భౌతిక దాడులకు పాల్పడిన కేసులో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎ్‌ఫఎఫ్) ఈసీ సభ్యుడు దీపక్ శర్మపై సస్పెన్షన్ వేటుపడింది. విచారణ ప్రక్రియలో భాగంగా దీపక్ నుంచి వివరాలు తీసుకొన్న అత్యవసర కమిటీ.. ఈ కేసును క్రమశిక్షణా సంఘానికి సిఫార్సు చేసింది. మహిళల ఫుట్‌బాల్ సెకండ్ డివిజన్ లీగ్‌లో పాల్గొనేందుకు హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ‘ఖాద్ ఎఫ్‌సీ’ జట్టు గోవాకు వచ్చింది. అయితే, ఆ టీమ్ యజమాని కూడా అయిన దీపక్.. తాగిన మైకంలో బలవంతంగా తమ రూమ్‌లోకి చొరబడి తమపై దాడి చేశాడని ఖాద్ ఎఫ్‌సీ బాధిత ప్లేయర్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఆటకు సంబంధించిన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని శర్మను ఏఐఎ్‌ఫఎఫ్ ఆదేశించింది.