Share News

నేను రెడీ!

ABN , Publish Date - Jun 03 , 2024 | 06:33 AM

టీమిండియా కోచ్‌ రేస్‌లో తన పేరు బలంగా వినిపిస్తున్నా.. గౌతమ్‌ గంభీర్‌ మాత్రం ఇప్పటి వరకూ ఆ విషయమై పెదవి విప్పలేదు. మరోవైపు కోచ్‌ పదవికి...

నేను రెడీ!

టీమిండియా కోచ్‌ పదవిపై గంభీర్‌

దుబాయ్‌: టీమిండియా కోచ్‌ రేస్‌లో తన పేరు బలంగా వినిపిస్తున్నా.. గౌతమ్‌ గంభీర్‌ మాత్రం ఇప్పటి వరకూ ఆ విషయమై పెదవి విప్పలేదు. మరోవైపు కోచ్‌ పదవికి దరఖాస్తుల గడువు గతనెల 27నే ముగిసినా..ఎవరెవరు అప్లై చేశారన్న సమాచారం కూడా బయటకు రాకపోవడంతో కోచ్‌ అంశంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గంభీర్‌ మాట్లాడుతూ.. భారత జట్టుకు కోచింగ్‌ ఇవ్వడం తనకు ఇష్టమేనని చెప్పేశాడు. ‘కోచింగ్‌ ఇచ్చేందుకు నేను సిద్ధం. జాతీయ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించడంకన్నా గొప్ప గౌరవం ఏముంటుంది? అది గొప్ప పదవి’ అని 42 ఏళ్ల గంభీర్‌ వ్యాఖ్యానించాడు.

Updated Date - Jun 03 , 2024 | 06:33 AM