Share News

వర్షం లేకున్నా ఆట రద్దు

ABN , Publish Date - Sep 10 , 2024 | 03:06 AM

తొలిసారిగా అఫ్ఘానిస్థాన్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మొదటి రోజు ఆట రద్దయ్యింది. సోమవారం ఇక్కడ వర్షం లేకపోయినా స్థానిక షహీద్‌ విజయ్‌సింగ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌...

వర్షం లేకున్నా ఆట రద్దు

వర్షం లేకున్నా ఆట రద్దు

కివీ్‌స-అఫ్ఘాన్‌ ఏకైక టెస్టు

నొయిడా: తొలిసారిగా అఫ్ఘానిస్థాన్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మొదటి రోజు ఆట రద్దయ్యింది. సోమవారం ఇక్కడ వర్షం లేకపోయినా స్థానిక షహీద్‌ విజయ్‌సింగ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ పూర్తి చిత్తడిగా ఉండడంతో టాస్‌ కూడా వేయలేని పరిస్థితి నెలకొంది. గత వారం రోజులుగా ఇక్కడ వర్షాలు కురుస్తున్నాయి. నీటిని తోడేసి మైదానాన్ని ఆరబెట్టేందుకు ఇక్కడ ఆధునిక సౌకర్యాలు లేకపోగా గ్రౌండ్‌ స్టాఫ్‌కు కూడా పెద్దగా అనుభవం లేదు. భవిష్యత్‌లో మరోసారి ఈ స్టేడియంలో ఆడేందుకు రాబోమని అఫ్ఘాన్‌ క్రికెట్‌ బోర్డు (ఏసీబీ) పేర్కొంది.

Updated Date - Sep 10 , 2024 | 03:06 AM