Share News

Surya Kumar Yadav: టీ-20 టీమ్ ఆఫ్ ది ఇయర్-2023 కెప్టెన్‌గా సూర్య.. టీమ్‌లో ఎవరెవరు ఉన్నారంటే..

ABN , Publish Date - Jan 22 , 2024 | 06:40 PM

గతేడాది టీ-20 ఫార్మాట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ ప్రకటించిన ``టీమ్ ఆఫ్ ది ఇయర్-2023`` కి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

Surya Kumar Yadav: టీ-20 టీమ్ ఆఫ్ ది ఇయర్-2023 కెప్టెన్‌గా సూర్య.. టీమ్‌లో ఎవరెవరు ఉన్నారంటే..

గతేడాది టీ-20 ఫార్మాట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ (ICC) ప్రకటించిన ``టీమ్ ఆఫ్ ది ఇయర్-2023`` (T20I Team of the Year for 2023)కి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గతేడాది టీ-20ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో కూడిన జట్టును తాజాగా ఐసీసీ ప్రకటించింది. ఆ జట్టుకు సూర్యను నాయకుడిగా నియమించింది. ఈ టీమ్‌లో మొత్తం నలుగురు భారత ఆటగాళ్లకు చోటు లభించడం విశేషం.

ఐసీసీ తాజాగా ప్రకటించిన ``టీమ్ ఆఫ్ ది ఇయర్-2023``లో సూర్య కుమార్ యాదవ్‌తో పాటు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), రవి బిష్ణోయ్ (Ravi Bishnoi), అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) చోటు దక్కించుకున్నారు. కాగా, గతేడాది సూర్య కుమార్ యాదవ్ 18 మ్యాచ్‌ల్లో మొత్తం 733 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి. అలాగే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన టీ-20 సిరీస్‌ల్లో టీమిండియాను విజయ పథాన నడిపించాడు. అలాగే యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ కూడా అంచనాలకు అనుగుణంగా రాణించారు.

ఐసీసీ టీమ్ ఆఫ్ ది ఇయర్-2023: సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, ఫిల్ సాల్ట్, నికోలస్ పూరన్, మార్క్ చాప్‌మన్, సికిందర్ రజా, రామ్‌జని, మార్క ఐదెర్, రవి బిష్ణోయ్, రిచర్డ్ ఎన్‌గరవ్, అర్ష్‌దీప్ సింగ్

Updated Date - Jan 22 , 2024 | 06:40 PM