Share News

బోపన్న జోడీదే మియామీ టైటిల్‌

ABN , Publish Date - Mar 31 , 2024 | 01:59 AM

లేటు వయసులో కుర్రాళ్లకు దీటుగా ఆడుతున్న భారత టెన్నిస్‌ వెటరన్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న ఖాతాలో మరో టైటిల్‌ చేరింది. ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి బోపన్న మియామీ ఓపెన్‌లో డబుల్స్‌ విజేతగా...

బోపన్న జోడీదే మియామీ టైటిల్‌

ఫ్లోరిడా: లేటు వయసులో కుర్రాళ్లకు దీటుగా ఆడుతున్న భారత టెన్నిస్‌ వెటరన్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న ఖాతాలో మరో టైటిల్‌ చేరింది. ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి బోపన్న మియామీ ఓపెన్‌లో డబుల్స్‌ విజేతగా నిలిచింది. శనివారం రాత్రి జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో టాప్‌సీడ్‌ బోపన్న/ఎబ్డెన్‌ ద్వయం 6-7(3-7), 6-3, 10-6తో రెండోసీడ్‌ డోడిగ్‌ (క్రొయేషియా)/క్రాసిజెక్‌ (అమెరికా) జంటపై గెలిచింది. మియామీలో బోపన్నకిదే తొలి టైటిల్‌.

Updated Date - Mar 31 , 2024 | 01:59 AM