Share News

Rohit Sharma: రోహిత్‌ శర్మను మరో ఏడాది కొనసాగించాల్సింది.. అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు!

ABN , Publish Date - Mar 11 , 2024 | 04:49 PM

నాయకుడిగా ముంబై టీమ్‌కు ఎన్నో టైటిళ్లు అందించిన రోహిత్‌ను పక్కన పెట్టిన ముంబై టీమ్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేసింది. దీంతో వివాదం చెలరేగింది. తాజాగా ఈ వివాదంపై చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు అంబటి రాయుడు స్పందించాడు.

Rohit Sharma: రోహిత్‌ శర్మను మరో ఏడాది కొనసాగించాల్సింది.. అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు!

ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు తమ అత్యుత్తమ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ (Rohit Sharma)ను ఉన్నట్టుండి పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది. నాయకుడిగా ముంబై టీమ్‌కు ఎన్నో టైటిళ్లు అందించిన రోహిత్‌ను పక్కన పెట్టిన ముంబై టీమ్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ను కెప్టెన్‌గా చేసింది. దీంతో వివాదం చెలరేగింది. తాజాగా ఈ వివాదంపై చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు అంబటి రాయుడు (Ambati Rayudu) స్పందించాడు. రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

``ఈ ఏడాది రోహిత్‌నే కెప్టెన్‌గా కొనసాగాల్సింది. వచ్చే ఏడాది హార్దిక్‌కు బాధ్యతలు అప్పగించాల్సింది. ముంబై టీమ్ ఏదో తొందరలో ఆ నిర్ణయం తీసుకున్నట్టు ఉంది. రోహిత్ ఇప్పటికీ టీ20ల్లో ఇండియాకు కెప్టెన్‌గా ఉన్నాడు. ముంబై టీమ్‌లో అందరూ స్టార్లే ఉంటారు. ఆ జట్టుకు కెప్టెన్సీ చేయడం అంత సులువు కాదు. చాలా ఒత్తిడి ఉంటుంద``ని రాయుడు అన్నాడు. అలాగే రోహిత్ శర్మను చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టులో చూడాలని ఉందని చెప్పాడు. రోహిత్ మరో ఐదారేళ్లు ఆడగలడని, అందువల్ల అతడిని సీఎస్కే తీసుకుంటే బాగుంటుందని అన్నాడు.

పదేళ్ల పాటు ముంబై టీమ్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ ఆ జట్టుకు ఐదు టైటిల్స్ అందించాడు. అలాంటి రోహిత్‌ను ఉన్నట్టుండి తప్పించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ భార్య రితిక కూడా సోషల్ మీడియా ద్వారా తన అసంతృప్తిని వెల్లడించింది. ఈ నేపథ్యంలో హార్దిక్ కెప్టెన్సీలో రోహిత్ ఆడతాడా లేదా అనే సస్పెన్స్ నెలకొంది. దీనికి మరి కొద్ది రోజుల్లో సమాధానం దొరకబోతోంది.

Updated Date - Mar 11 , 2024 | 04:49 PM