Share News

ఆదినుంచే అదరగొట్టి..

ABN , Publish Date - Nov 28 , 2024 | 04:38 AM

ప్రపంచ చెస్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్లో భారత గ్రాండ్‌మాస్టర్‌ గుకేష్‌ తొలి విజయం అందుకున్నాడు. బుధవారం జరిగిన మూడో రౌండ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ను గుకేష్‌ చిత్తు చేశాడు. దాంతో...

ఆదినుంచే అదరగొట్టి..

  • మూడో గేమ్‌లో గుకేష్‌ గెలుపు

  • ప్రపంచ చెస్‌

సింగపూర్‌: ప్రపంచ చెస్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్లో భారత గ్రాండ్‌మాస్టర్‌ గుకేష్‌ తొలి విజయం అందుకున్నాడు. బుధవారం జరిగిన మూడో రౌండ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ను గుకేష్‌ చిత్తు చేశాడు. దాంతో 14 గేముల చాంపియన్‌షి్‌పలో లిరెన్‌, గుకేష్‌ చెరో 1.5 పాయింట్లతో సమంగా నిలిచారు. మొదటి గేమ్‌లో లిరెన్‌ గెలవగా, రెండో గేమ్‌ డ్రా అయిన సంగతి తెలిసిందే. గురువారం విశ్రాంతి దినం. శుక్రవారం నాలుగో రౌండ్‌ జరుగుతుంది. మూడో రౌండ్‌లో తెల్లపావులతో బరిలోకి దిగిన గుకేష్‌ ఆరంభంనుంచే అదరగొట్టాడు. టోర్నీ నిబంధనల ప్రకారం..తొలి 120 నిమిషాల్లో 40 ఎత్తులను ఆటగాళ్లు పూర్తి చేయాలి. 13వ ఎత్తుకు వచ్చేసరికి గుకేష్‌ తిరుగులేని స్థితిలో నిలిచాడు.


అప్పటికి గుకేష్‌ కేవలం నాలుగు నిమిషాలే తీసుకోగా..లిరెన్‌ సమయంలో గంటా ఆరు నిమిషాలు అయిపోయింది. దాంతో 32 ఏళ్ల చైనా జీఎం ఒత్తిడిలో పడిపోయాడు. చివరి ఆరు ఎత్తులకు అతడికి కేవలం పది సెకన్లకంటే తక్కువ సమయమే మిగిలింది. దాంతో 37వ ఎత్తులో లిరెన్‌ ఓటమి అంగీకరించక తప్పలేదు.

Updated Date - Nov 28 , 2024 | 04:39 AM