హైదరాబాద్ రెండో ఓటమి
ABN , Publish Date - Oct 22 , 2024 | 01:59 AM
ఉత్తరాఖండ్‌తో రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ 78 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓవర్‌నైట్ స్కోరు 189/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఉత్తరాఖండ్ 235 పరుగులకు...
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌తో రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ 78 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓవర్‌నైట్ స్కోరు 189/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఉత్తరాఖండ్ 235 పరుగులకు ఆలౌటైంది. ఆల్‌రౌండర్ మిలింద్ (3/31) టెయిలెండర్ల పనిపట్టాడు. అనంతరం 269 పరుగుల లక్ష్య ఛేదనలో హైదరాబాద్ ఆటగాడు రోహిత్ రాయుడు (47 నాటౌట్) రాణించాడు. రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 190 పరుగులకు ఆలౌటై, ఈ సీజన్‌లో రెండో ఓటమిని నమోదు చేసింది.. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఉత్తరాఖండ్ 325, హైదరాబాద్ 292 పరుగులకు ఆలౌటయ్యాయి.