హైరదాబాద్ మరో పరాజయం
ABN , Publish Date - Nov 28 , 2024 | 04:22 AM
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. బుధవారం రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్...

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. బుధవారం రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 24 పరుగులతో హైదరాబాద్‌పై గెలిచింది. తొలుత రాజస్థాన్ 20 ఓవర్లలో 187/8 స్కోరు చేసింది. ఛేదనలో హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 రన్స్‌కే పరిమితమై ఓటమిపాలైంది. ఇక, ఉప్పల్ స్టేడియంలో జరిగిన పోరులో ఆంధ్ర జట్టు 8 వికెట్లతో గోవాను చిత్తుచేసి వరుసగా రెండో గెలుపు అందుకుంది.