Share News

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ విజయం

ABN , Publish Date - Jan 14 , 2024 | 02:26 AM

తాజా రంజీ సీజన్‌లో హైదరాబాద్‌ వరుసగా రెండో విజయం సాధించింది. ఏకంగా ఇన్నింగ్స్‌ 81 పరుగుల భారీ తేడాతో మేఘాలయను చిత్తు చేసిన హైదరాబాద్‌ రెండ్రోజుల్లోనే...

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ విజయం

రోహిత్‌ అజేయ శతకం

షిల్లాంగ్‌: తాజా రంజీ సీజన్‌లో హైదరాబాద్‌ వరుసగా రెండో విజయం సాధించింది. ఏకంగా ఇన్నింగ్స్‌ 81 పరుగుల భారీ తేడాతో మేఘాలయను చిత్తు చేసిన హైదరాబాద్‌ రెండ్రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించడం విశేషం. ఓవర్‌నైట్‌ స్కోరు 182/4తో శనివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్‌ 346/7 వద్ద డిక్లేర్‌ చేసింది. రోహిత్‌ రాయుడు సెంచరీ (124 నాటౌట్‌)తో అదరగొట్టగా, మిలింద్‌ (50 నాటౌట్‌) అర్ధ శతకంతో రాణించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో మేఘాలయ 154 పరుగులకే కుప్పకూలింది. తనయ్‌ 3 వికెట్లు, మిలింద్‌, రవితేజ చెరో 2 వికెట్లు తీశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో మేఘాలయ 111 రన్స్‌కు ఆలౌటైంది. రోహిత్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

Updated Date - Jan 14 , 2024 | 06:44 AM