Share News

History of Chamari : చమరి చరిత్ర

ABN , Publish Date - Jul 23 , 2024 | 06:23 AM

శ్రీలంక కెప్టెన్‌ చమరి అటపట్టు (69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 119 నాటౌట్‌) చరిత్ర సృష్టించింది. మహిళల ఆసియా కప్‌ టోర్నీలో శతక్కొట్టిన తొలి క్రికెటర్‌గా చమరి రికార్డు సృష్టించిన

History of Chamari  : చమరి చరిత్ర

ఆసియా కప్‌లో తొలి సెంచరీ

మలేసియాపై శ్రీలంక గెలుపు'

నేపాల్‌తో భారత్‌ పోరు నేడు

రాత్రి 7నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో..

దంబుల్లా: శ్రీలంక కెప్టెన్‌ చమరి అటపట్టు (69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 119 నాటౌట్‌) చరిత్ర సృష్టించింది. మహిళల ఆసియా కప్‌ టోర్నీలో శతక్కొట్టిన తొలి క్రికెటర్‌గా చమరి రికార్డు సృష్టించిన వేళ..సోమవారం జరిగిన గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌ శ్రీలంక 144 పరుగులతో మలేసియాను చిత్తు చేసింది. తొలుత శ్రీలంక 20 ఓవర్లలో 184/4 స్కోరు చేసింది. ఛేదనలో మలేసియా 19.5 ఓవర్లలో 40 పరుగులకే కుప్పకూలింది. గ్రూప్‌ ‘బి’ మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఏడు వికెట్లతో థాయ్‌లాండ్‌ని ఓడించింది. మొదట థాయ్‌లాండ్‌ 20 ఓవర్లలో 96/9 స్కోరు చేసింది. అనంతరం బంగ్లాదేశ్‌ 17.3 ఓవర్లలో 100/3 స్కోరు చేసి గెలిచింది.

Updated Date - Jul 23 , 2024 | 06:39 AM