Share News

Gymnast Karmakar : కర్మాకర్‌కు చారిత్రక స్వర్ణం

ABN , Publish Date - May 27 , 2024 | 04:35 AM

ఆసియా సీనియర్‌ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా దీపా కర్మాకర్‌ చరిత్ర

Gymnast Karmakar : కర్మాకర్‌కు చారిత్రక స్వర్ణం

తాష్కెంట్‌ (ఉజ్బెకిస్థాన్‌): ఆసియా సీనియర్‌ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా దీపా కర్మాకర్‌ చరిత్ర సృష్టించింది. మహిళల వాల్ట్‌ ఫైనల్లో 30 ఏళ్ల దీప 13.566 పాయింట్ల సగటుతో టాప్‌లో నిలిచి పసిడిని పట్టేసింది. కిమ్‌ సన్‌ హయంగ్‌ రజతం, జొ క్యోంగ్‌ బయోల్‌ కాంస్యం సొంతం చేసుకొన్నారు. 2015లో ఇదే ఈవెంట్‌లో కర్మాకర్‌, ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌లో ఆశిష్‌ కుమార్‌ కాంస్య పతకాలు దక్కించుకొన్నారు. కాగా, 2019, 2022లో వాల్ట్‌ ఈవెంట్‌లో ప్రణతి నాయర్‌ కంచు మోత మోగించింది. డోపింగ్‌లో పట్టుబడి 21 నెలల నిషేధానికి గురైన దీప.. పారిస్‌ ఒలింపిక్స్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

Updated Date - May 27 , 2024 | 04:35 AM