Irfan Pathan : తొలిసారి భార్య ఫొటో షేర్ చేశాడు
ABN , Publish Date - Feb 05 , 2024 | 06:08 AM
టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ తన 8వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య సఫా బేగ్‌తో కలిసున్న ఫొటోను పోస్ట్ చేశాడు. గతంలోనూ ఇర్ఫాన్ భార్యతో ఉన్న ఫొటోలను షేర్ చేసినా..
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ తన 8వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య సఫా బేగ్‌తో కలిసున్న ఫొటోను పోస్ట్ చేశాడు. గతంలోనూ ఇర్ఫాన్ భార్యతో ఉన్న ఫొటోలను షేర్ చేసినా.. అందులో ఆమె ముఖం కనిపించేది కాదు. దీంతో అతనిపై చాలా విమర్శలు వ్యక్తమయ్యా యి. ఇప్పుడు తొలిసారి భార్య ముఖం కనిపించేలా ఉన్న ఫొటోను షేర్ చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు. సౌదీ మోడల్ సఫాను ఇర్ఫాన్ 2016లో వివాహం చేసుకొన్నాడు.