Share News

హర్మన్‌ సేన ఫ్లాప్‌ షో

ABN , Publish Date - Jan 03 , 2024 | 02:06 AM

ఆల్‌రౌండ్‌ వైఫల్యంతో భారత మహిళల జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఫోబీ లిచ్‌ఫీల్డ్‌ (125 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 119) సెంచరీతో...

హర్మన్‌ సేన ఫ్లాప్‌ షో

  • మూడో వన్డేలో భారత్‌ చిత్తు

  • లిచ్‌ఫీల్డ్‌ శతకం ఫ 3-0తో ఆసీస్‌ క్లీన్‌ స్వీప్‌

ముంబై: ఆల్‌రౌండ్‌ వైఫల్యంతో భారత మహిళల జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఫోబీ లిచ్‌ఫీల్డ్‌ (125 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 119) సెంచరీతో.. మంగళవారం ఏకపక్షంగా జరిగిన మూడో, ఆఖరి వన్డేలో ఆసీస్‌ 190 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. మూడు వన్డేల సిరీ్‌సను 3-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. తొలుత ఆసీస్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 338 పరుగుల స్కోరు చేసింది. వన్డేల్లో భారత్‌పై కంగారూలకు ఇదే అత్యధిక స్కోరు. కెప్టెన్‌ అలిస్సా హీలీ (82) రాణించింది. శ్రేయాంక పాటిల్‌ మూడు వికెట్లు, అమన్‌జోత్‌ రెండు వికెట్లు పడగొట్టారు. స్పిన్నర్‌ మన్నత్‌ కశ్యప్‌ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసింది. ఛేదనలో భారత్‌ 32.4 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. దీప్తి శర్మ (25 నాటౌట్‌), స్మృతీ మంధాన (29), జెమీమా (25) టాప్‌ స్కోరర్లు. యాస్తిక (6), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (3)తోపాటు రిచా (19) విఫలం కావడంతో టీమిండియా మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకొంది. వేర్హమ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. సదర్లాండ్‌, మేగన్‌ స్కట్‌, అలనా కింగ్‌లు తలో రెండు వికెట్లు దక్కించుకొన్నారు. లిచ్‌ఫీల్డ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీ్‌స’గా నిలిచింది.

స్కోరుబోర్డు

ఆస్ట్రేలియా: లిచ్‌ఫీల్డ్‌ (సి) హర్మన్‌ (బి) దీప్తి 119, హీలీ (బి) వస్త్రాకర్‌ 82, పెర్రీ (ఎల్బీ) అమన్‌జోత్‌ 16, మూనీ (ఎల్బీ) పాటిల్‌ 3, మెక్‌గ్రాత్‌ (ఎల్బీ) పాటిల్‌ 0, గార్డ్‌నర్‌ (బి) పాటిల్‌ 30, సదర్లాండ్‌ (సి) హర్మన్‌ (బి) అమన్‌జోత్‌ 23, వేర్హమ్‌ (నాటౌట్‌) 11, అలనా కింగ్‌ (నాటౌట్‌) 26; ఎక్స్‌ట్రాలు: 28; మొత్తం: 50 ఓవర్లలో 338/7; వికెట్ల పతనం: 1-189, 2-209, 3-216, 4-216, 5-256, 6-295, 7-299; బౌలింగ్‌: రేణుక 7-0-52-0, వస్త్రాకర్‌ 10-0-68-1, పాటిల్‌ 10-0-57-3, కశ్యప్‌ 3-0-30-0, దీప్తి 10-0-53-1, అమన్‌జోత్‌ 10-0-70-2.

భారత్‌: యాస్తిక (బి) స్కట్‌ 6, మంధాన (సి) గార్త్‌ (బి) స్కట్‌ 29, రిచా (బి) వేర్హమ్‌ 19, హర్మన్‌ప్రీత్‌ (సి) మూనీ (బి) వేర్హమ్‌ 3, జెమీమా (సి) కింగ్‌ (బి) గార్డ్‌నర్‌ 25, దీప్తి (నాటౌట్‌) 25, అమన్‌జోత్‌ (సి) లిచ్‌ఫీల్డ్‌ (బి) కింగ్‌ 3, పూజా వస్త్రాకర్‌ (బి) కింగ్‌ 14, పాటిల్‌ (సి) మెక్‌గ్రాత్‌ (బి) సదర్లాండ్‌ 2, రేణుక (సి) హీలీ (బి) సదర్లాండ్‌ 0, మన్నత్‌ (సి) మూనీ (బి) వేర్హమ్‌ 8; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 32.4 ఓవర్లలో 148 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-32, 2-43, 3-57, 4-72, 5-98, 6-102, 7-128, 8-135, 9-135; బౌలింగ్‌: మేగన్‌ స్కట్‌ 6-1-23-2, కిమ్‌ గార్త్‌ 5-0-33-0, వేర్హమ్‌ 6.4-0-23-3, గార్డ్‌నర్‌ 7-0-38-1, అలనా కింగ్‌ 5-0-21-2, సదర్లాండ్‌ 3-0-9-2.

3

పరుగుల పరంగా భారత్‌కు ఇది మూడో అతిపెద్ద ఓటమి.

4

వన్డేల్లో 100 వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్‌గా దీప్తి శర్మ. జులన్‌ గోస్వామి (255), నీతూ డేవిడ్‌ (141), నౌషీన్‌ (100) ముందుగా ఈ ఘనతను అందుకొన్నారు.

9

టీమిండియాపై ఆసీస్‌కు ఇది వరుసగా 9వ సిరీస్‌ విజయం.

Updated Date - Jan 03 , 2024 | 02:06 AM