Share News

కొత్త ముఖాలకు చోటు కష్టమే!

ABN , Publish Date - Apr 18 , 2024 | 02:29 AM

డెడ్‌లైన్‌ దగ్గరపడుతుండంతో..టీ20 వరల్డ్‌కప్‌నకు భారత జట్టు ఎంపికపై సెలెక్టర్లు దృష్టి సారించారు. ప్రస్తుత పరిస్థితులనుబట్టి కొత్త ముఖాలకు జట్టులో చోటు కష్టమని తెలుస్తోంది...

కొత్త ముఖాలకు చోటు కష్టమే!

  • జైస్వాల్‌-గిల్‌, రింకూ-దూబే మధ్య పోటీ

  • టీ20 వరల్డ్‌క్‌ప జట్టు ఎంపిక నెలాఖరున ?

న్యూఢిల్లీ: డెడ్‌లైన్‌ దగ్గరపడుతుండంతో..టీ20 వరల్డ్‌కప్‌నకు భారత జట్టు ఎంపికపై సెలెక్టర్లు దృష్టి సారించారు. ప్రస్తుత పరిస్థితులనుబట్టి కొత్త ముఖాలకు జట్టులో చోటు కష్టమని తెలుస్తోంది. అంతేకాకుండా గతంలో పరీక్షించిన ఒకరిద్దరు ఆటగాళ్లకు కూడా నిరాశ తప్పేలా లేదు. వరల్డ్‌కప్‌ జట్ల ప్రకటనకు ఐసీసీ వచ్చే నెల ఒకటో తేదీని కటా్‌ఫగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ ఈ నెలాఖరు కల్లా 15 మంది సభ్యుల భారత జట్టును ఎంపిక చేయనుంది. కాగా, అమెరికా-వెస్టిండీస్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న పొట్టి వరల్డ్‌కప్‌ జూన్‌ 2 నుంచి జరగనుంది. ఓపెనర్‌ స్థానం కోసం పోటీలో ఉన్న యశస్వీ జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌లో ఒకరికి మాత్రమే జట్టులో చోటు లభించే అవకాశాలున్నాయి. ఇక, ఫినిషర్‌ స్థానం కోసం రింకూ సింగ్‌, శివమ్‌ దూబే మధ్య పోటీ నెలకొంది. రిషభ్‌ పంత్‌కు బ్యాక్‌పగా రెండో వికెట్‌ కీపర్‌ రేసులో సంజూ శాంసన్‌, రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌ ఉన్నారు. అయితే, రాహుల్‌, ఇషాన్‌ ఐపీఎల్‌లో ఓపెనర్లుగా దిగుతుండడంతో మిడిలార్డర్‌లో వీరు ఎలా ఆడతారనేది సెలెక్టర్లకు తలనొప్పిగా మారింది. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ ఫిట్‌నెస్‌పై అనుమానాలున్నా.. ప్రస్తుతానికి అతడి ఎంపికలో ఎటువంటి సందేహాలు లేవు. కోహ్లీ ఎంపిక కూడా లాంఛనం కానుంది.

టీమిండియా ప్రాబబుల్స్‌ (15+5 స్టాండ్‌బై)

బ్యాటర్లు (6): రోహిత్‌, యశస్వీ జైస్వాల్‌, గిల్‌, కోహ్లీ, సూర్యకుమార్‌, రింకూ సింగ్‌; ఆల్‌ రౌండర్లు (4): హార్దిక్‌ పాండ్యా, జడేజా, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌; స్పిన్నర్లు (3): కుల్దీప్‌ యాదవ్‌, చాహల్‌, రవి బిష్ణోయ్‌; వికెట్‌ కీపర్లు (3): రిషభ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌, సంజూ శాంసన్‌; పేసర్లు (4): బుమ్రా, సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, అవేశ్‌ ఖాన్‌.

Updated Date - Apr 18 , 2024 | 02:29 AM