పాక్ ఘన విజయం
ABN , Publish Date - Oct 19 , 2024 | 06:40 AM
మూడున్నర సంవత్సరాలు, 11 టెస్టుల అనంతరం పాకిస్తాన్ జట్టు స్వదేశంలో విజయాన్ని అందుకుంది. శుక్రవారం ముగిసిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ 152 పరుగులతో పాక్ చేతిలో
నోమన్‌కు 8 వికెట్లు
మూడున్నరేళ్ల తర్వాత
స్వదేశంలో టెస్ట్ గెలుపు
ముల్తాన్: మూడున్నర సంవత్సరాలు, 11 టెస్టుల అనంతరం పాకిస్తాన్ జట్టు స్వదేశంలో విజయాన్ని అందుకుంది. శుక్రవారం ముగిసిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ 152 పరుగులతో పాక్ చేతిలో చిత్తయింది. 297 పరుగుల లక్ష్యంతో, ఓవర్‌నైట్ 36/2 స్కోరుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పర్యాటక జట్టు 144 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ పది వికెట్లను స్పిన్నర్లు నోమన్ అలీ (8/46), సాజిద్ ఖాన్ (2/93) తీశారు. మొదటి ఇన్నింగ్స్ పది వికెట్లనూ వారిద్దరే చేజిక్కించుకు న్నారు. ఇలా ఓ టెస్ట్ మ్యాచ్‌లో 20 వికెట్లను ఇద్దరు బౌలర్లే కైవసం చేసుకోవడం 1972 తర్వాత ఇదే తొలిసారి ఇక..మ్యాచ్‌లో పాక్ 366, 221 రన్స్ చేయగా, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 291 స్కోరు సాధించింది.