భజన్‌కు స్వర్ణం
ABN , Publish Date - Jun 17 , 2024 | 04:48 AM
ఆంటాల్య: ఫైనల్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో భారత ఆర్చర్లు భజన్ కౌర్, అంకితా భక్త్ సత్తా చాటారు. మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో భజన్ స్వర్ణ పతకం గెలవడంతో పాటు పారిస్ ఒలింపిక్స్‌కు బెర్త్ ఖాయం చేసుకుంది...

ఒలింపిక్ బెర్త్ ఖరారు
‘పారిస్’కు అంకిత కూడా అర్హత
ఆంటాల్య: ఫైనల్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో భారత ఆర్చర్లు భజన్ కౌర్, అంకితా భక్త్ సత్తా చాటారు. మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో భజన్ స్వర్ణ పతకం గెలవడంతో పాటు పారిస్ ఒలింపిక్స్‌కు బెర్త్ ఖాయం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో భజన్ 6-2తో టాప్‌సీడ్ మొబినా ఫలా (ఇరాన్)ను చిత్తుచేసి విజేతగా నిలిచింది. ఇక, ఇదే విభాగం క్వార్టర్స్‌లో అంకిత 4-6తో మొబినా చేతిలో ఓడింది. అయితే, క్వార్టర్స్ చేరడంతో అంకితకు కూడా పారిస్ విశ్వక్రీడలకు టికెట్ దక్కింది. ఇక, భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి తొలి రౌండ్‌లోనే ఓడి నిరాశపర్చింది.