వ్రితి, తీర్థుకు స్వర్ణాలు
ABN , Publish Date - Jan 29 , 2024 | 05:34 AM
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో హైదరాబాద్ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ మూడో స్వర్ణం సాధించింది. ఆదివారం చెన్నైలో జరిగిన 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో వ్రితి స్వర్ణం నెగ్గింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో హైదరాబాద్ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ మూడో స్వర్ణం సాధించింది. ఆదివారం చెన్నైలో జరిగిన 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో వ్రితి స్వర్ణం నెగ్గింది. మరో తెలంగాణ అమ్మా యి నిత్య 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో కాంస్యం సాధించింది. విజయవాడ స్విమ్మర్ తీర్థు సామదేవ్ 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ కేటగిరీలో స్వర్ణం అందుకున్నాడు. బాలుర వాలీబాల్‌లో ఆంధ్రప్రదేశ్ కాంస్యం గెలిచింది. ఇక, ఆంధ్ర వెయిట్‌లిఫ్టర్లు రాము (89 కిలోలు) స్వర్ణం, ప్రేమ్‌సాగర్ (81 కిలోలు) కాంస్యం కొల్లగొట్టారు.