Sarabjot : సరబ్‌జోత్‌కు స్వర్ణం
ABN , Publish Date - Jun 07 , 2024 | 04:55 AM
వరల్డ్ చాంపియన్ బోవెన్ ఝాంగ్ (చైనా), నాలుగుసార్లు ఒలింపియన్ యూసుఫ్ డికెక్ (టర్కీ) వంటి అగ్రశ్రేణి షూటర్లను వెనక్కు నెట్టిన సరబ్‌జోత్ సింగ్ ఐఎస్‌ఎ్‌సఎఫ్ వరల్డ్ కప్‌లో స్వర్ణ పతకం కొల్లగొట్టాడు.

మ్యూనిచ్: వరల్డ్ చాంపియన్ బోవెన్ ఝాంగ్ (చైనా), నాలుగుసార్లు ఒలింపియన్ యూసుఫ్ డికెక్ (టర్కీ) వంటి అగ్రశ్రేణి షూటర్లను వెనక్కు నెట్టిన సరబ్‌జోత్ సింగ్ ఐఎస్‌ఎ్‌సఎఫ్ వరల్డ్ కప్‌లో స్వర్ణ పతకం కొల్లగొట్టాడు. గురువారం జరిగిన పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్ ఫైనల్లో 22 ఏళ్ల సరబ్‌జోత్ 242.7 పాయింట్లు స్కోరు చేసి టైటిల్ దక్కించుకున్నాడు. షూయ్‌హాంగ్ (చైనా) రజతం, రాబిన్ వాల్టర్ (జర్మనీ) కాంస్యం నెగ్గారు. సరబ్‌జోత్ స్వర్ణంతో ఈ పోటీల్లో భారత్ పతక ఖాతా తెరిచింది.