Share News

గోయెంకా దిద్దుబాటు చర్యలు

ABN , Publish Date - May 15 , 2024 | 02:00 AM

కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌పై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తంజేసి వివాదంలో కూరుకుపోయిన లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ యజమాని సంజీవ్‌ గోయెంకా దిద్దుబాటు...

గోయెంకా దిద్దుబాటు చర్యలు

  • రాహుల్‌తో ప్రత్యేక విందు

న్యూఢిల్లీ: కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌పై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తంజేసి వివాదంలో కూరుకుపోయిన లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ యజమాని సంజీవ్‌ గోయెంకా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో సోమవారం రాత్రి కేఎల్‌ రాహుల్‌ను ఆయన ప్రత్యేకంగా విందుకు ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. గత బుధవారం సన్‌రైజర్స్‌ చేతిలో లఖ్‌నవూ 10 వికెట్లతో ఓడిన అనంతరం గ్రౌండ్‌లోకి వచ్చిన సంజీవ్‌ గోయెంకా కెప్టెన్‌ రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తంజేయడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

Updated Date - May 15 , 2024 | 02:00 AM